మా రవీందర్ గురు స్వామి గారి ఆశీర్వచనములతో ...
చిన్ని చిన్ని వాడివే అయ్యప్పా
చిన్నారి పసి వాడివే అయ్యప్పా
కన్నా వారి ప్రేమ కాస్తైనా తెలియని పొన్నంబల రెడువే " చిన్ని చిన్ని"
వికృత రూపంబున అయ్యప్ప భూత నాధుడ వైతివా అయ్యప్ప
లోక రక్షణ కొరకు బ్రహ్మ కార్యార్తివై బాల రూపము దాల్తివా
లాలా లెవ్వరు బోసిరి అయ్యప్ప జోల లెవ్వరు పాడిరి అయ్యప్ప
పాలు బువ్వ పెట్టి జోల పాట పాడి ఎవరు నిను జోకోట్టిరి
ఎంత ఒంటరి వాడివి అయ్యప్ప ఎన్నాళ్ళ పసి వాడివి అయ్యప్ప
ఏకాంత వాసి వై పొన్నంబల పైన ఎన్నాళ్ళు కూచుంటివి
దేవతలు నిను జూచిరి అయ్యప్ప ఆహాకారము జేసిరి అయ్యప్ప
చిన్న వాడివని గద్దేక్క రాదనీ మెట్లయ్యి ఎక్కిన్చిరి. "చిన్ని చిన్ని "
కనులా కందని రూపము అయ్యప్ప మాట కందని రూపము
మకర సంక్రాన్తిన రెండు కన్నులు తెరిచి లోకాన్ని చూస్తుంతివా
కల లోన నిను జూచితి అయ్యప్ప కన్నీరు నే గార్చితే అయ్యప్ప
గురువులకు గురువైన బాల గురు స్వామి నీ మతము నే దాల్చితి "చిన్ని చిన్ని "
జో జో జో జో జో జో ....
No comments:
Post a Comment